
ఐరాస భద్రతా మండలిలో అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. విధుల నిర్వహణలో భారత్‌కు సంపూర్ణ మద్దతు అందిస్తామని రష్యా, ఫ్రాన్స్ ప్రకటించాయి. భారత్ అజెండా స్ఫూర్తి దాయకంగా ఉందని రష్యా అభినందించింది.
ఉగ్రవాదంపై పోరు, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర ప్రపంచ అంశాలను భారత్ అజెండాలో చేర్చడాన్ని రష్యా ప్రస్తావించింది.
మరోవైపు ఫ్రాన్స్ కూడా భారత్‌కు అభినందనలు తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత తదితర వ్యూహాత్మక అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
‘‘ఫ్రాన్స్ తర్వాత ఈ పదవిని భారత్ చేపట్టడం సంతోషంగా ఉంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లెనెన్ ట్వీట్ చేశారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతున్న భారత్‌కు.. భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం రావడం ఇదే తొలిసారి. 2022 వరకు భారత్ ఈ పదవిలో కొనసాగుతుంది.





