News

తాలిబన్ల పై ఆఫ్ఘన్ వైమానిక దాడులు – 30 మంది తీవ్రవాదులు హతం

921views

ఫ్ఘనిస్థాన్ ​లోని రెండు రాష్ట్రాల్లో ఆ దేశ వాయుసేన జరిపిన దాడుల్లో 30 మందికి పైగా తాలిబన్లు హతమయ్యారు. జజ్వాన్​ రాష్ట్రం ముర్గాబ్​, హసన్​ గ్రామాల్లోని తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడుల్లో 19 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. 15 మందికి గాయాలైనట్లు ఆ దేశ రక్షణశాఖ మంత్రి స్పష్టం చేశారు. తాలిబన్లకు చెందిన ఐదు వాహనాలు, రెండు బంకర్లు, ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. హెల్మాండ్​ రాష్ట్రం.. లష్కర్​ ఘా ప్రాంతంలోని తాలిబన్ల స్థావరాలపై జరిపిన దాడుల్లో 14 మంది ముష్కరులు, మరో ఇద్దరు ఇతర దేశానికి చెందిన ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.