ప్రతికూల పరిస్థితుల్లోనూ మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్న ఆకాష్ క్షిపణి – వెల్లడించిన డీఆర్డిఓ వర్గాలు
230
దేశీయ ఆకాశ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల వ్యవధిలో రెండో పరీక్ష కాగా ఈసారి ప్రతికూల వాతావరణంలో నిర్దేశిత పనితీరు కనబరిచినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పేర్కొంది. ఒడిశా బాలేశ్వర్లోని ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్షలు చేపట్టారు. గగనతలంలో వేగంగా దూసుకెళ్తున్న మానవరహిత లోహ విహంగాన్ని ఆకాశ్ ఛేదించిందని డీఆర్డీఓ తెలిపింది. ఉపరితలం నుంచి గగనతలంలో 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్ సొంతం. నేటి పరీక్షలో లాంచర్, రాడర్, కమాండ్ అండ్ కంట్రోల్‌తో పాటు పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును సమీక్షించారు.