News

విజయవాడ : కార్మికులను సత్కరించిన BMS

561views

భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ గాంధీ నగర్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో సీనియర్ బి ఎం ఎస్ కార్యకర్త, మాజీ రాష్ర్ట కార్యదర్శి శ్రీ M. సాయిబాబు భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) జెండాను ఆవిష్కరించారు. వివిధ రంగాలకు చెందిన కార్మికులందరూ కలిసి ఉండాల్సిన ఆవశ్యకతను శ్రీ సాయిబాబు వివరించారు. బి ఎం ఎస్ కృష్ణా జిల్లా కార్యదర్శి శ్రీ కోదండ రామయ్య మాట్లాడుతూ బిఎంఎస్ ఎప్పుడు ఏర్పడింది కార్మిక సంక్షేమానికి బిఎంఎస్ ఇప్పటివరకు ఏం చేస్తూ వస్తోంది, బీఎంఎస్ పోరాటాల ఫలితంగా ఎటువంటి విజయాలు లభించాయనే విషయాలు వివరించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ లో సీనియర్ కార్మికులు అయిన శ్రీ సత్యం, శ్రీ నాయుడులను కార్మికులు అందరి సమక్షంలో శాలువాతో సత్కరించి వారికి దుస్తులు బహూకరించటమైనది. భారతీయ టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ శ్రీ కొర్రపోలు శ్రీనివాసరావు, సామాజిక సమరసతా వేదిక విజయవాడ నగర కార్యదర్శి శ్రీ కొత్త రాము, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయవాడ నగర వ్యవస్థా ప్రముఖ్ శ్రీ దివ్వెల కృష్ణ, సీనియర్ న్యాయవాది శ్రీ మేకల వెంకటేశ్వర రావు మరియు వివిధ రంగాలకు చెందిన కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.