News

ఎన్కౌంటర్ లో లష్కరే తొయిబా కమాండర్ హతం

693views

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన వారిలో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. మరింత మంది ముష్కరులు ఉన్నారన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.