News

జమ్మూలో ఎన్కౌంటర్.. ఇద్దరు పాక్ తీవ్రవాదుల మృతి

513views

మ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లా దాదల్ అటవీ ప్రాంతంలోని సుందర్​బని సెక్టార్​లో ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను ఎన్కౌంటర్ చేశాయి భద్రతా దళాలు. ముష్కరులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులైనట్లు రక్షణ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. నాయబ్ శ్రీజిత్ ఎం, సిపాయి మరుపోలు జశ్వంత్ రెడ్డి ప్రాణాలు విడిచినట్లు తెలిపారు.

ఉగ్రవాదుల చొరబాట్లు, సంచారానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు విస్తృత తనిఖీలు చేపట్టింది సైన్యం. ఈ క్రమంలో.. దాదల్ అటవీ ప్రాంతంలో ముష్కరులు కాల్పులు మొదలుపెట్టి.. హ్యాండ్ గ్రెనేడ్​లను విసిరారని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.