News

చైనా వద్ద 71 వ్యాక్సిన్లు… వెల్లడించిన ఆ దేశ శాస్త్రవేత్త…ముందస్తు ప్రణాళికే అంటూ అమెరికా విమర్శ

287views

రోనా వైరస్‌కు వ్యతిరేకంగా చైనా మొత్తం 71 వ్యాక్సీన్లను అభివృద్ధి చేస్తోందని, ఆ వ్యాక్సీన్లు డెల్టా మ్యూటేటెడ్ వైరస్‌పై కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని చైనా దేశానికి చెందిన టాప్ ఎపిడెమియాలజిస్ట్ జోంగ్ నాన్షాన్ వెల్లడించారు. షాంఘై టెక్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా ఆ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో నాన్షాన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవిడ్ 19 వైరస్‌కు వ్యతిరేకంగా చైనా దేశం వ్యాక్సీన్లపై చేస్తోన్న పరిశోధనలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. 71 వ్యాక్సీన్లపై పరిశోధనలు జరుగుతుండగానే.. ఇప్పటికే తొమ్మిది టీకాలు వాడుకలోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వీటిలోనూ రెండింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు. డబ్ల్యూహెచ్ఓ అనుమతులు ఇచ్చిన కోవిడ్ వ్యాక్సీన్లలో చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్ ఉన్నాయి. చైనా తయారు చేసిన టీకాలు.. కరోనా తీవ్రమైన లక్షణాలను తగ్గించడంలోనూ ప్రభావంతంగా పని చేస్తాయని నాన్షాన్ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న డెల్టా వైరస్‌ను సైతం ఈ వ్యాక్సీన్లు ఎదుర్కొంటాయన్నారు. దీనిపై స్పందించిన అమెరికా ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని విమర్శించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.