
961views
దాదాపు రూ.7.5 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 18 కిలోల మాదక ద్రవ్యాలు ఓ పార్శిల్‌లో ఉన్నట్లు గుర్తించారు. హెరాయిన్‌ను సన్నటి పైపుల్లో నింపి వాటిని గాజులుగా మార్చారు. వాటిని ఆఫ్రికా నుంచి ఢిల్లీలోని ఓ అడ్రస్‌కు పంపారు. మరోవైపు గత వారమే ఇద్దరు దక్షిణాఫ్రికా దేశస్థులు 126 కిలోల హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.





