
సంతుష్టీకరణ రాజకీయాలు మనకు స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రారంభమయ్యాయి. క్రీ. శ. 1921 వ సంవత్సరం వీటికి ప్రారంభ కాలం. ఖిలాపత్ ఉద్యమ కాలంలో పూర్తిస్ధాయిలో మొదలైన బుజ్జగింపు రాజకీయాలు, నాటి నుండి నేటి వరకూ అవి అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి. ఇవి రెండు రకాలు.
నేరుగా రాజకీయపరమైనవి….
ఓట్లకోసం, మైనార్టిలపేరుతో ముఖ్యంగా ముస్లింలకు అడిగినవి, అడగనివి అన్నీ సమకూర్చి, నిరంతరం వారిని గారాబం చేస్తూ, నెత్తినెక్కించుకోవటం.
చరిత్ర, సంస్కృతి సంతుష్టీకరణ…
భారతదేశాన్ని పాలించిన ముస్లిం రాజులలో అధికులు మతోన్మాదులు, కర్కోటకులు, నరహంతుకులు, మారణకాండలకు కారకులు, మతమార్పిడులే ధేయ్యంగా బతికిన వారు. అలాంటి వారి చరిత్రను మార్చి, భావితరాలను ఏమార్చటమే ధ్యేయంగా చరిత్ర రచన జరిగింది. దీనిలో ప్రముఖపాత్ర పోషించినవారు కమ్యునిష్టులు. అసత్యాల పుట్టగా చరిత్రను నింపేశారు.
నరరూపరాక్షసులను మానవతావాదులుగా, రక్తపిపాసులను శాంతికాముకులుగా చిత్రించారు. దుర్మార్గపాలనను రామరాజ్యంగా వక్రీకరించారు. అలా వండివార్చిన చరిత్రను పాఠ్యాంశాలుగా పెట్టి పిల్లలకు వాస్తవాలు తెలియకుండా చేశారు. వీటన్నింటికి మూలం ఓటుబ్యాంకు రాజకీయాలు.
కొద్ది సంవత్సరాల క్రితం, అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, టిప్పు సుల్తాన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినపుడు, మైసూరు, మలబార్, కొడగు ప్రాంతాల హిందువులు, మంగళూరు క్రైస్తవులు తీవ్ర నిరసన తెలిపారు. కర్ణాటక ప్రజలు గర్వించదగ్గ చక్రవర్తులు మయూరశర్మ, రెండవ పులకేశి, అమోఘవర్షుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి వారెందరో ఉన్నారు. అయినా నాటి సిద్ధరామయ్య ప్రభుత్వం వీరిలో ఎవరినీ పట్టించుకోకుండా, కేవలం టిప్పు జయంతిని మాత్రమే నిర్వహించాలనుకోవటంలో ఉద్దేశ్యం స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయ ప్రయోజనాల సాధన కోసం రేపు మరో పాలకుడు “ఔరంగజేబు జయంతి”ని కూడా అధికారికంగా నిర్వహించాటానికి పూనుకోడని చెప్పలేము.
అలాంటి వక్రీకరించి రాయబడ్డ, గతంలో సీరియల్ గా తీయబడ్డ, త్వరలో సినిమాగా రాబోతున్న వ్యక్తి చరిత్రను జాతీయవాద కళ్ళతో చూద్దాం. ఆ వ్యక్తి ఎవరో కాదు. కర్ణాటక ప్రాంతాన్నేలిన ముస్లిం పాలకుడు టిప్పుసుల్తాన్.
సగటు భారతీయుడికి టిప్పుసుల్తాన్ ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రిటిష్ వారిని అడ్డుకుని, వారిని తరిమివేసి, భారతదేశ స్వాతంత్ర్య పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు. అసమాన ధైర్యశాలి. తన ప్రజల ఉద్దరణకోసం కొత్త టెక్నాలజీ దిగుమతితో ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు. పరమత సహనం ఆయన రక్తంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. కరుణామూర్తి. హిందూ దేవాలయాలకు ఇతోధికంగా బంగారు కానుకలు పంపి, ప్రజల మనస్సులలో చెరిపినా చెరగని స్ధానం సుస్ధిరం చేసుకున్న మానవతామూర్తి……ఇలా చిన్నప్పటినుండి పాఠ్యపుస్తకాల్లో చిత్రించబడిన టిప్పుసుల్తాన్ చరిత్ర నేటికీ దాదాపుగా అలాగే చెలామణి అవుతోంది.
సాధారణంగా మీడియా కొంతవరకైనా నాణేనికి రెండోవైపును చూపటానికి ప్రయత్నిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ, భారత మీడియాలో అత్యధిక భాగం, వివిధ పక్షాల రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే బాడుగ సరుకైంది. కించిత్తు కూడా తన ప్రాధమిక బాధ్యతను అది స్వీకరించలేకపోయింది.
నిజం నిప్పులాంటిది. ఏనాటికైనా బయటకు రాక తప్పదు. సోషల్ మీడియా వేదికగా ఔత్సాహికులెందరో నేడు, గతంపై దృష్టి సారించారు. దిగ్ర్భాంతికరమైన నిజాలు, పాఠకులను మరింత దిగ్ర్భాంతికి గురిచేస్తున్నాయి. పాఠ్యపుస్తకాల్లో వండివార్చిన కట్టు కథలను గాక టిప్పుసుల్తాన్ అసలైన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
విఖ్యాత విజయనగర సామ్రాజ్యం 1565 తళ్ళికోట యుద్ధంలో పతనమైంది. తర్వాత ఎంతో కాలం పాటు అనిశ్చితి కొనసాగింది. చిన్నచిన్న రాజ్యాలు అనేకం విజయనగరం స్ధానంలో వెలుగులోకి వచ్చాయి. అలాంటి వాటిలో ఒకటి మైసూరు రాజ్యం. వడయార్ పేరుగల హిందూ రాజ వంశం మైసూరును పాలించారు. 1761 ప్రాంతంలో నాటి మైసూరు పాలకుడైన రెండవ కృష్ణరాజ వడయార్ ను మోసంతో పదవీ భ్రష్టుడిని చేసి, సింహాసనాన్ని ఆక్రమించి, మైసూరు పాలకుడయ్యాడు టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ. 1782 వరకూ పాలించాడు. 1782లో బ్రిటిష్ వారితో జరిగిన రెండవ మైసూరు యుద్దసమయంలో మరణించాడు.
ఈయన కుమారుడై టిప్పుసుల్తాన్. అసలు పేరు ఫతే అలీ సాహెబ్. స్ధానిక ముస్లిం ఫకీర్ టిప్పుమస్లాన్ ఔలియా పేరున ఇతగాడికి టిప్పుసుల్తాన్ పేరు స్ధిరమైంది. రెండవ మైసూరు యుద్ధసమయంలో తండ్రి మరణించిన వెంటనే, పాలకుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. బ్రిటిష్ వారితో సంధి చేసుకుని, తాత్కాలికంగా యుద్ధం విరమించాడు. కానీ తన రాజ్యాన్ని నిలుపుకోవాలనే తపనతో ఉన్న సుల్తాన్ కు, భారతదేశంలో తమకు బలమైన ప్రత్యర్ధి ఉండకూడదనే తలంపు కలిగిన బ్రిటిష్ ఈస్టిండియా కంపెనికి మధ్య ఈ పొత్తు ఎంతో కాలం పొసగలేదు. అందువలన మూడవ మైసూరు యుద్ధం 1792లో జరిగింది. టిప్పు, తన రాజ్యంలో సగభాగాన్ని కోల్పోయాడు.
తాను కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సాధించాలనే తపనతో ఫ్రెంచివారితో పోత్తుపెట్టుకుని, మద్ధతు కోసం టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల నేతలను భారతదేశంపై దాడులకు ఆహ్వానించాడు. 1799లో నాల్గవ మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వారినెదుర్కొని, యుద్ధంలో మరణించాడు. అంతటితో టిప్పు సామ్రాజ్యం అంతరించింది.
సంక్షిప్తంగా చెప్పబడిన ఈ టిప్పుచరిత్ర చదివితే, భారతీయ పాలకుడైన టిప్పుసుల్తాన్, బ్రిటిష్ వారి అధికారానికి రాజీపడక, దేశ స్వాతంత్ర్య పరిరక్షణకు కోసం పోరాడి, ప్రాణాలర్పించిన యోధుడిగా కనబడతాడు. కాని లోతుకెళ్ళిచూస్తే అతగాడి అసలు చరిత్ర కనబడుతుంది.
టిప్పు పూర్వీకులు గల్ఫ్ ప్రాంతంలోని ఒమన్ దేశ ప్రాంతానికి చెందినవారు.
ఘనతవహించిన వామపక్ష చరిత్రకారులు టిప్పుసుల్తాన్ ను ఆకాశానికెత్తేశారు. టిప్పుకు లేని ఎన్నో భూషణాలను అలంకరించారు. అతగాడి అవలక్షణాలను మాయతెరలతో కప్పెట్టేశారు. తన సొంతకుర్చీ కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నాలను, దేశ బానిస సంకెళ్ళు తెంపటానికి చేసిన పోరాటంగా అభివర్ణించారు. ఆయనను భారతదేశ దాస్య విముక్తి కోసం పోరాటానికి పూనుకున్న పురాణపురుషుగా మార్చేశారు. ఒక నరరూప రాక్షసుడికి మానవతావాదిగా కలరింగ్ ఇచ్చారు. చివరికి భారతీయుల బుర్రలకు ఎర్రవాష్ చేసి ఏమార్చారు.
ఈ చరిత్రకారులు టిప్పుసుల్తాన్ గొప్పతనానికి క్రింది అంశాలు నిదర్శనంగా చూపారు.
పరమత సహనం…..
టిప్పు గొప్ప పరమత సహనం కలవాడని, ఎన్నో హిందూ దేవాలయాలకు మాన్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా ఇచ్చాడని సాక్ష్యం చూపారు. శ్రీరంగపట్టణంలోని ప్రముఖదేవాలయాలు భద్రంగా ఉండటానికి టిప్పు పరమత సహనమే ఋజువంటూ వాదించారు. టిప్పు ఆస్ధానంలో పూర్ణయ్య అనే హిందువు ప్రముఖ పదవిలో ఉండటాన్ని సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. కొద్దిపాటి నిజాలనే ముసుగుతో అసంఖ్యాక ఘాతుకాలను కప్పిపెట్టటంలో వామపక్షీయులు సిద్ధహస్తులు.
పైన పేర్కొన్న అంశాలు పాక్షికంగా నిజాలైయుండవచ్చు. కానీ అవన్నీ రాజకీయపరమైన అవసరాలకొద్దీ చేసినవి. మూడవ మైసూరు యుద్ధం(1792)లో ఓటమిపాలైన టిప్పుసుల్తాన్, తన రాజ్యంలో సగ భూభాగాన్ని కోల్పోయాడు. పైగా ఈస్టిండియా కంపెనీకి మూడు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సివచ్చింది. ఈ మొత్తం తమ ఖజానాలో జమ పడే వరకూ హామీగా ఉండేందుకు తన ఇద్దరు కుమారులను మద్రాసులోని కంపెనీ ప్రధాన కార్యాలయానికి అప్పగించాడు. వెన్ను విరిగిన స్ధితిలో, అంతకుముందు హిందువులపై ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డప్పటికీ, ఇప్పుడు హిందువుల మద్ధతు లేనిదే, తాను తిరిగి పూర్వ వైభవం పొందలేనన్న సత్యాన్ని గుర్తించిన టిప్పు, ఒకటి, రెండు దేవాలయాలకు దానాలు చేశాడు. అలాగే పూర్ణయ్య అనే అఖండ తెలివితేటలున్న వ్యక్తిని ముఖ్యమైన పదవిలో కొనసాగనిచ్చాడు.
ఇక అతని పరమత సహనం ఏపాటిదో చూద్దాం…..
తాను పదవిలోకి వచ్చిన వెంటనే, సామ్రాజ్య విస్తరణలో భాగంగా కేరళ, కర్ణాటకలోని కొడగు, మంగళూరులోని క్రైస్తవులపై దాడులకు దిగాడు. దేశంలోని అధిక ముస్లిం పాలకులకు వలే టిప్పు సుల్తాన్ పచ్చి మతోన్మాది. ఇస్లాం రాజ్య స్ధాపనే ధ్యేయంగా అతడు చేసిన క్రూరమైన పనులు మానవత్వానికి మచ్చగా మిగిలాయి.
ఎమ్.హెచ్.గోపాల్ అనే చరిత్రకారుని ప్రకారం…మైసూరు రాజ్యంలోని ముస్లింలందరికీ ఇంటిపన్ను, వస్తువులపై (గృహావసర సంబంధమైన) పన్నులు మినహాయించబడ్డాయి.
కేరళలోని మలబార్ ప్రాంతంపై మొదట అతను దాడులు చేశాడు. స్ధానిక చిన్న చిన్న పాలకులు చేతులెత్తేయగానే, సామాన్య ప్రజానీకంపై విరుచుకుపడ్డాడు. అందరినీ మతం మార్చటమే ధ్యేయంగా ఎన్నో రకాలుగా హింసించాడు. ఔరంగజేబు దార్-ఉల్-హర్బ్(అవిశ్వాసులకు నిలయమైన ప్రాంతం) అయిన భారతదేశాన్ని దార్-ఉల్-ఇస్లాం (విశ్వాసుల దేశం) గా మార్చటానికి తన జీవితమంతా ఎలా ప్రయత్నించాడో, అలాగే టిప్పు కూడా, తాను పాలిస్తున్న మైసూరు రాజ్యాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చూడాలని కలలుగన్నవాడు. తన లక్ష్యసాధన కోసం కనికరం లేని రీతిలో అవిశ్వాసులని తాను భావించిన వారందరినీ మతం మార్చటానికి నిరాకరించినవారిపై అనాగరిమైన తీరులో హత్యాకాండలకు పాల్పడ్డాడు.
కేరళ, మంగుళూరు, కొడగు ప్రాంతాల్లో టిప్పు చేసిన దాడులు, అక్కడి ముస్లిమేతరులతో అతడు వ్యవహరించిన తీరు, అతడిలోని రాక్షసత్వాన్ని వెల్లడిస్తాయి. అక్కడి దేవాలయాలను అతడి సైన్యం లూటీ చేసింది. విగ్రహాలను ధ్వంసం, అపవిత్రం చేయటం జరిగింది. పురుషులను హత్య చేయటం, స్త్రీలపై అత్యాచారం చేయటం, వారి కూతుర్లను తమతో తీసుకెళ్ళిపోవటం…. జరిగిన ఘోరాలకు ఉదంతాలు. ముస్లిమేతరులపై భారీగా పన్నులు విధించటమైంది. దేవాలయలతో పాటు జైన మందిరాలు, క్రైస్తవ చర్చిలు విధ్వంసానికి, దోపిడికి గురయ్యాయి. దాదాపు 800 పైచిలుకు హిందూ దేవాలయాలు టిప్పు వల్ల విధ్వంసానికి గురైనట్లు చరిత్రకారుల అంచనా….
కర్నాటకలోని ఎన్నో పట్టణాల హిందూ పేర్లను తొలగించి, వాటికి ఇస్లామిక్ పేర్లు పెట్టిన ఘనుడు టిప్పుసుల్తాన్. అతడు మార్చిన పట్టణాల పేర్లు పాతవి…కొత్తవి.
మైసూరు ….. నజరాబాద్ (Nazarbad)
మంగుళూరు …. జలాలాబాద్ (Jalalabad)
హసన్ …..ఖైమాబాద్ (Khayimabad)
సక్లేష్ పూర్….. మన్సూరాబాద్
క్యాలికట్ ….. ఇస్లామాబాద్ (Islamabad)
మడికేరి ….. జఫరాబాద్ (Jaffarabad)
సిరా…… రుస్తుమాబాద్ (Rustumabad)
దేవనహళ్లి ….. యుసుఫాబాద్ ( Yusufabad)
తన 50 సంవత్సరాల పాలనా కాలంలో ఔరంగజేబు చేసిన అకృత్యాలను, టిప్పు కేవలం 17 సంవత్సరాలలోనే పూర్తిచేయగల్గాడు. ఇస్లాం పరిరక్షకుడిగా , ఇస్లాం సేవలో ఆలయాల విధ్వంసమనేది భక్తితో చేసే కార్యంగా భావించాడు. లక్షల మంది హిందు, జైన, క్రైస్తవ మతస్తులను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేయించాడు. అతని క్రూరకృత్యాలకు నిదర్శనంగా కొడగు సంఘటనను చూపవచ్చు. దాదాపు 800 ల కొడగు కుటుంబాలను, కొడగు జిల్లాలోని దేవట్టిపరంబు అనే అటవీ ప్రాంతంలో, బహిరంగంగా హతమార్చాడు. కొడగు ప్రజలపై టిప్పు అకృత్యాలు అన్నీఇన్నీ కావు. ఏనుగుల కాళ్ళకు బతికున్న మనుషులను కట్టి, వాటిని పరుగెత్తించటంతో, నేలపై రక్కమోడుతూ అనేకమంది ప్రాణాలు వదిలారు.
1799లో బ్రిటిష్ వారు టిప్పును హతమార్చినప్పుడు, శ్రీరంగపట్టణంలో బంధించబడిన దాదాపు 12000 కొడగు కుటుంబాలు తప్పించుకుని, తిరిగి కూర్గ్ కు వెళ్ళిపోయాయి. ఎన్ని వేల మంది కూర్గు ప్రజలు టిప్పు చేతుల్లో మరణించారో, ఇదమిద్ధంగా తెలియదు. ఇలాంటి పైశాచికానందం పొందిన మనిషిని మానవతావాదిగా పాఠ్యపుస్తకాల్లో చిత్రించటమంటే… చరిత్రపై అత్యాచారం చేయటమే.
కొడగు ప్రాంతంలోని చాలా మంది ముస్లింలకు, నేటికీ వారి పాత హిందూ ఇంటి పేర్లు ఉండటం కనబడుతుంది. దీనిని బట్టి వారంతా బలవంతపు మతమార్పిడికి గురయ్యారని చెప్పవచ్చు. కూర్గు ప్రాంతంలో నేటికీ చాలామంది ప్రజలు తమ కుక్కలకు టిప్పు అని పేరు పెట్టటం జరుగుతంది. రెండువందల సంవత్సరాలు గతించినా, టిప్పుపై అక్కడి వారికి కోపం చల్లారలేదనటానికి ఇదే నిదర్శనం.
కేరళలోని మలబార్ లో గల క్యాలికట్ పట్టణం శతాబ్దాలుగా సుగంధద్రవ్యాల వ్యాపారానికి పెట్టింది పేరు. టిప్పు సుల్తాన్ దాడుల వలన ఆనగరం పూర్తిగా తగులబడి, చరిత్రలో మొదటిసారిగా దాదాపు నలభై నుండి యాభై సంవత్సరాల పాటు సుగంధద్రవ్యాల వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. టిప్పుసుల్తాన్ నిజంగా స్వాతంత్ర్యసమరయోధుడైతే, ఎటువంటి ప్రతిఘటన లేని ప్రదేశంలోని, తన దేశ వాణిజ్యకూడలియైన నగరాన్ని నాశనం చేస్తాడా ?
18 జనవరి, 1790 వ తేదీన సయ్యద్ అబ్దుల్ దులాయ్ అనే వాడికి రాసిన లేఖలోని ముఖ్యాంశం చూడండి..
“With the grace of Prophet Muhammad and Allah, almost all Hindus in Calicut are now converted to Islam. Only a few are still not converted on the borders of Cochin State. I am determined to convert them also very soon. I consider this as Jehad to achieve that object.”
19 జనవరి, 1790లో తన అనుచరుడైన బద్రూజ్ జమాన్ ఖాన్ కి రాసిన లేఖలో తన ఇస్లామిక్ మత మౌఢ్యాన్ని ఇలా బయటపెట్టుకున్నాడు.
“Don’t you know I have achieved a great victory recently in Malabar and over four lakh Hindus were converted to Islam. I am now determined to march against the cursed Raman Nair.” (రామవర్మ లేక రామనాయర్ అప్పటి ట్రావన్కూర్ రాజ్య ప్రభువు)
టిప్పుసుల్తాన్ తరపున పోరాడిన ఫ్రెంచి దేశస్తుడైన Francois Fidele Ripaud de Montaudever అనేవాడు, టిప్పుసైన్యం క్రూరత్వంపై రాసిన మాటలు…” I’m disturbed by Tipu Sultan’s treatment of these most gentle souls, the Hindus. During the siege of Mangalore, Tipu’s soldiers daily exposed the heads of many innocent Brhmins within sight from the fort for the Zamonrin and his Hindu followers to see.”
టిప్పుసుల్తాన్ కు సహాయంగా పోరాడిన మరో ఫ్రెంచి సైనికాధికారి Ripaud తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. “To show his ardent devotion and steadfast faith in the Mohammadan religion, Tipu Sultan found Kozhikode to be the most suitable place. Kozhikode was then a centre of Brahmins and had over 7,000 Brahmin families living there. Over 2000 Brahmin families perished as a result of Tipu Sultan’s Islamic cruelties. He did not spare even women and children.”
Bartolomaco అనే పేరుగల పోర్చుగీసు యాత్రికుడు, టిప్పు అనాగరిక చేష్టలను ఇలా వర్ణించాడు.
First orps of 30,000 barbarians who butchered everybody on the way…followed by the field-gun unit under the French commander, M.Lally. Tipu was riding on an elephant behind which another army of 30,000 soldiers followed. Most of the men and women were hanged in Calicut, first mothers were hanged with their children tied to necks of mothers. That barbarian Tipu Sultan tied the naked Christians and Hindus to the legs of elephants and made the elephants to move around till the bodies of the helpless victims were torn to pieces. Temples and churches were ordered to be burned down, desecrated and destroyed. Christian and Hindu women were forced to marry Mohammadans and similarly their men were forced to marry Mohammadan women. Those Christians who refused to be honoured with Islam were ordered to be killed by hanging immediately. These atrocities were told to me by the victims of Tipu Sultan who escaped from the clutches of his army and reached Varappuzha, which is the centre of Carmichalel Christian Mission. I myself helped many victims to cross the Varappuzha river by boats.
ఉత్తరభారతంలో మహ్మద్ ఘజనీ, అల్లావుద్దీన్ ఖిల్జి, నాదిర్షాలు అక్కడి హిందువులపై జరిపిన అకృత్యాల కంటే, మలబార్, కొడగు హిందువులపై టిప్పుసుల్తాన్ జరిపిన అకృత్యాలు ఎన్నో రెట్లు అనాగరికంగా ఉన్నాయని Lowis B Boury అనే ఆంగ్లేయుడు పేర్కొనటం జరిగింది.
కర్నాటకలోని మాండ్యా జిల్లాలోగల మెల్కోటే అనే ఊరు ఆలయాల పట్టణం(Temple Town). అక్కడ ఉండేవారందరూ అయ్యంగార్ బ్రాహ్మణులు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా మెల్కోటే అయ్యంగార్ బ్రాహ్మణ వంశస్తురాలే. కొంతమంది మెల్కోటే వాసులు పాత వడయార్ ప్రభువు పునరుద్ధానం కోసం పనిచేస్తున్నారనే వార్తను నమ్మి, ఆ ప్రాంతంపై దాడి చేసిన టిప్పు దాదాపు 800 మంది అయ్యంగార్లను వధించాడు. అనేకమంది అయ్యంగార్లను జైలుపాలుజేశాడు. ఆరోజు నరక చతుర్ధశి(దీపావళి ముందురోజు). నాటి నుండి నేటి వరకూ మెల్కోటే అయ్యంగార్లు, నాటి వధ కారణంగా నరకచతుర్ధశిని జరుపుకోరు.
మంగళూరు ప్రాంతం నుండి క్రైస్తవులను బంధించి, తన రాజదానియైన శ్రీరంగపట్టణానికి తరలించి, వారిని బానిసలుగా మార్చారు. వారి యావత్తు ఆస్ధినీ స్వాధీనం చేసుకోవటమైనది. ఇస్లాంలోకి మారిన వారికి పన్ను మినహాయింపులు వర్తింపజేయటమైనది. దివాన్ పూర్ణయ్య మినహా యావత్తు హిందువులందరినీ, తన ఆస్ధానంలోని ఉద్యోగాల నుండి తొలగించి, వారి స్ధానంలో పూర్తిగా ముస్లింలను నియమించటమైనది.
ప్రఖ్యాతమైన టిప్పు ఖడ్గం పిడిపై రాయబడిన వ్రాతలే, అతని ఇస్లామిక్ మత మౌఢ్యానికి నిదర్శనాలు. క్రీ.శ.1799లో అతను మరణించేనాటికి, అతని విశాలమైన రాజ్యంలో కేవలం రెండే, రెండు దేవాలయాల్లో మాత్రమే నిత్య పూజలు జరుగుతుండేవి. ఆ రెంటిని కూడా అతగాడు వదిలివేయటానికి కారణం, జోతిష్యంలో అతనికున్న నమ్మకం మాత్రమే. అతని జ్యోతిష్కుల సలహాపై మాత్రమే వాటి జోలికి టిప్పు పోలేదు.
టిప్పుసుల్తాన్ దేవాలయాల విధ్వంస చరిత్ర తెలిసి అప్పట్లో, కేరళలోని ప్రఖ్యాతమైన గురువాయుర్ శ్రీకృష్ణదేవాలయంలోని మూలవిరాట్టు(విగ్రహం)ను ముందు జాగ్రత్తగా తిరువాన్కూరుకు 200కి.మీ కు దక్షిణంగా ఉన్న అంబళప్పుజ (Ambalapuzha)కు తరలించటమైనది.
దాదాపు నాలుగు లక్షలమంది హిందువులను ఇస్లాంలోకి మార్చానని సగర్వంగా చెప్పుకున్న టిప్పుసుల్తాన్ స్వాతంత్ర్యసమరయోధుడా? ముస్లిం మతోన్మాదా? మైసూరు రాజ్యంలోని ఎన్నో పట్టణాలకు, వాటి పాత పేర్లు తొలగించి, ముస్లిం పేర్లు పెట్టిన ఘనుడు టిప్పు.
టిప్పును స్వాతంత్ర్యసమరయోధుడిగా వామపక్ష మరియు స్వార్ధపరులైన చరిత్రకారులు చిత్రికీరించారు. టిప్పు సుల్తాన్ తన కుర్చీని కాపాడుకునేందుకు మాత్రమే బ్రిటిష్ వారితో పోరాడాడు తప్ప, సాటి భారతీయ పాలకులందరినీ చైతన్యపరచి, బ్రిటిష్ వారిపై యుద్ధానికి దిగలేదు. వాస్తవానికి రాజ్యాన్ని కాపాడుకోవటం, ఇస్లామికీకరణ అనేవి రెండే టిప్పు లక్ష్యాలు. టిప్పుకు మైసూరు టైగర్ అనే బిరుదును కూడా తగిలించారు. 1990ల్లో దూరదర్శన్ లో ప్రసారమైన The Sword of Tippu Sultan సీరియల్ లో టిప్పు పులితో పోరాడి విజయం సాధించినట్లు కల్పనలు జోడించారు. భగవాన్ గిద్వాని అనే రచయిత రాసిన నవల ఆధారంగా ఆ సీరియల్ ను నిర్మించారు. వాస్తవ చరిత్ర అనే కన్నా కాల్పనిక రచన అనటం సబబు. అలాంటి నవల ఆధారంగా నిర్మించిన ఆ సీరియల్ ను కూడా చరిత్రగా భావించటం సరికాదు. ఆయన ఏ పులితోనూ పోరాడలేదు. కేవలం టిప్పు ఖ్యాతిని ఆకాశానికెత్తటం కోసమే ఈ రకమైన భూషణాలంకరణ జరిగింది.
టిప్పుసుల్తాన్ కు రాకెట్ టెక్నాలజీ పితామహుడిగా కొత్త కలరింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఫ్రెంచి వారితో జరిగిన ఒప్పందంలో భాగంగా, వారు పలు ఆయుధాలు సరఫరా చేశారు. వాటిలో కొన్ని రాకెట్ లాంచర్లున్నాయి. వాటిని చూపి, ప్రపంచాని రాకెట్ టెక్నాలజిని అందించిన తొలి శాస్త్రవేత్తగా చిత్రికరించటమనేది, భిన్నరకాలుగా టిప్పును గ్లోరిపై చేయటానికి మాత్రమే.
పాకిస్తాన్ తాను తయారు చేసిన అనేక క్షిపణులలో ఒకదానికి టిప్పు అనే పేరు పెట్టటం జరిగింది. అందుకు కారణం ఊహించలేనిదేమీ కాదు. ఘజ్ని, ఘోరి ,అబ్దాలి, బాబర్, వంటి పేర్లు వారు క్షిపణులకు పెట్టారు. అలాంటి పాలకుల సరసన టిప్పు పేరు చేర్చారంటేనే, టిప్పు ఒక ఇస్లామిక్ మత వ్యాపకుడు అని వారు అంగీకరించినట్లు.
వక్రీకరణ చరిత్రకారులు, టిప్పుకు కన్నడభాషా ఉద్దారకుడనే ఆభరణాన్ని అలంకరించారు. నిజానికి కన్నడ భాషా ప్రాంతమైన మైసూరు రాజ్యంలో కన్నడం స్ధానంలో పార్శీ భాషను అధికార భాషగా నిర్ణయించాడు. నాడు ప్రధాన ఆదాయ వనరైన భూమిశిస్తు రికార్డులన్నీ పార్శీ భాషలోకి తర్జుమా చేయించాడు. ఆ భాషలోనే నిర్వహించేలా ఆదేశించాడు. అందుకే నేటికీ మైసూరు ప్రాంతంలో రెవిన్యూ రికార్డుల్లో పార్శీ పదాలెన్నో కనబడతాయి. ఉదాహరణకు Khatha, Phani, Khaneshmari, Thakthe, Thari, Kushki, Amaldar, Shirastedar వంటివన్నీ పార్శీ భాషా పదాలే.
ఇలాంటి మతమౌఢ్యుడ్ని సర్వమత సమోద్ధారకుడందామా? సహనశీలి, స్వాతంత్ర్య సమర యోధుడని కీర్తిద్దామా? చరిత్ర పుస్తకాలను ఆయన పేరిట ఉన్న కల్పిత వీరోచిత గాథలతో నింపేద్దామా? ఆ రక్త పిపాసి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుందామా? వేలాది మంది మానవతుల మాన ప్రాణాలను హరించిన ఆ నరరూప రాక్షసుడికి విగ్రహాలు పెడదామా? దండలు వేద్దామా? దండాలు పెడదామా? ఒక్కసారి చరిత్రలోని సత్యాలను అవలోకించుకుని ఆలోచించుకుందాం……





