News

టోక్యో ఒలింపిక్స్ కు… భారత్ నుంచి వంద మంది క్రీడాకారులు…

651views

టోక్యో ఒలింపిక్స్ కు భారత్‌ నుంచి 100 మంది క్రీడాకారులు అర్హత సాధించినట్లు.. మరికొంత మంది అర్హత సాధించే అవకాశమున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తంచేసింది.

బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, రెజ్లింగ్, రోవింగ్, అథ్లెటిక్స్, ఆర్చెరీ, హార్స్ రైడింగ్, ఫెన్సింగ్, షూటింగ్, టెబుల్ టెన్నిస్‌ సహా 12 విభాగాల పోటీల్లో పాల్గొనేందుకు భారత అథ్లెట్లు అర్హత సాధించారు.

భారత్ నుంచి టోక్యో వెళ్లబోయే అథ్లెట్లతోపాటు అధికారులకు కూడా రెండు డోసుల వ్యాక్సీన్లు పూర్తిగా ఇస్తామని భారత క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

భారత్ అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించిందని ఏఎన్ఐ వార్తా సంస్థతో భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర బాత్రా చెప్పారు. టోక్యోలో అడుగుపెట్టిన మూడు రోజుల వరకు ఇతర అథ్లెట్లు, లేదా ఇతర బృందాలతో భారత అథ్లెట్లు కలవకూడదని నిబంధనలు విధించినట్లు పేర్కొన్నారు.

“చాలా మంది అథ్లెట్లు నేరుగా టోక్యోకు వెళ్తున్నారు. వారికి ఈ విషయాలు స్పష్టంగా చెబుతున్నాం. అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే వారి విషయంలోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.” అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.