
491views
దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా అన్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ ఔట్ పెరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. అంతకముందు ఆయన క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. 20,500 గంటల ఫ్లయింగ్ శిక్షణను ఈ బ్యాచ్ పూర్తి చేసిందన్నారు. వైమానిక దళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్ గార్డుగా ఐదుగురు క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.
వీరిలో బీటెక్ పూర్తి చేసిన 87 మంది ఫ్లయింగ్ అధికారులుగా ఉండటం శుభ పరిణామం అని బదౌరియా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన శిక్షకులకు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. దేశం కోసం త్యాగం చేయడమే ఫ్లయింగ్ అధికారుల లక్ష్యమన్నారు. కరోనా వేళ దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాలో వైమానిక దళం కీలకపాత్ర పోషించిందని బదౌరియా వివరించారు.





