News

కలకత్తా భాజపా కార్యాలయం సమీపంలో బాంబుల కలకలం

491views

లకత్తాలోని భాజపా కార్యాలయం సమీపంలో దొరికిన నాటు బాంబులు కలకలం రేపాయి. సుమారు 51 బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు కలకత్తా యాంటీ రౌడీ స్క్వాడ్కు చెందిన పోలీసులు తెలిపారు. కలకత్తా హేస్టింగ్స్ ప్రాంతంలోని భాజపా కార్యాలయానికి సుమారు 20మీటర్ల దూరంలో ఈ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఫ్రూట్ బాక్సుల్లో బాంబులను మొదట స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.