572
జమ్ముకశ్మీర్ అనంత నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జిల్లాలోని బిజ్బెహరా జబ్లిపొరా ప్రాంతంలో స్థానిక పౌరులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
జబ్లిపోరా ప్రాతంలో కాల్పులకు(Firing) పాల్పడగా.. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది సేపటికే పరిస్థితి విషమించి మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు సంజీద్ పారీ, షా భట్గా గుర్తించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.