News

అసోంలో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు ఉగ్రవాదులు హతం!

858views

సోంలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అసోం రైఫిల్స్‌ దళం, పోలీసులు.. దిమాస నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) మధ్య ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరి గాయి. ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు.

ఘటనా స్థలంలూ నాలుగు ఏకే-47, మరో నాలుగు తుపాకులు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో డీఎన్ఎల్ఏ సహ ఇతర ఉగ్రమూకల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.