News

కోవిడ్ బాధిత క్రీడాకారులకు కేంద్రం చేయూత

793views

దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న మాజీ అథ్లెట్లు, కోచ్ లకు అండగా ఉందేందుకు కేంద్ర క్రీడల శాఖ సిద్ధమైంది. వైరస్ కారణంగా వైద్య, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రీడాకారులను ఆదుకునేందుకు ఓ కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖ, శాయ్, భారత ఒలింపిక్ సంఘం(ఐఓసీ) కలిసి శ్రీకారం చుట్టాయి. వీరికోసం ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను రూపొందించాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రీడాకారులు తమ పేరు ఇందులో నమోదు చేసుకోగానే తక్షణమే స్పందించి వారికి సాయం చేసేందుకు కృషి చేస్తారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.