
581views
కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి అందరూ అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని వినడం లేదంటూ ఝార్ఖండ్ సీఎం హేమంత్‌సోరెన్ చేసిన ట్వీట్‌పై జగన్ స్పందించారు. కోవిడ్‌పై జరుగుతున్న యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదని.. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమని హేమంత్‌సోరెన్‌కు జగన్ సూచించారు. కరోనా విజృంభిస్తోన్న వేళ తగినంత ఆక్సిజన్‌తో పాటు టీకాలు సరఫరా చేయడం లేదంటూ చాలా మంది ముఖ్యమంత్రులు బహిరంగంగానే కేంద్రాన్ని తప్పుబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఝార్ఖండ్ సీఎం హేమంత్‌సోరెన్ కూడా ప్రధానిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. సోరెన్ చేసిన ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ ప్రధాని మోడీకి జగన్ మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. ఆపత్కాలంలో ముఖ్యమంత్రి చూపిన పరిణతికి పలువురు ఆయనను ప్రశంసిస్తున్నారు.





