
యునైటెడ్ కింగ్డమ్ 21 అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో పాకిస్తాన్ ను కూడా చేర్చింది. మనీలాండరింగ్, తీవ్రవాదులకు నిధులను సమకూర్చడం వంటి కార్యకలాపాల కారణంగా పాకిస్తాన్ ను అత్యంత ప్రమాదకరమైన ఇరవై ఒక్క దేశాల జాబితాలో చేరుస్తున్నట్టుగా యూకే వెల్లడించింది.
2017 మార్చి 26 నుంచి అమలులోకి వచ్చిన ‘ మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ రెగ్యులేషన్ సవరణ ప్రకారం ఈ జాబితా తయారు చేసినట్లుగా యూకే తెలిపింది.
కాగా పాకిస్తాన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌదరి మాట్లాడుతూ ఇది వాస్తవాలపై ఆధారపడి లేదని, రాజకీయంగా ప్రేరేపించబడిందని, ఈ చర్య పాకిస్తాన్ ఎఫ్ఎటిఎఫ్ యొక్క గ్రే లిస్టు నుండి బయటపడే అవకాశాలను ప్రభావితం చేస్తుందని అన్నారు.
పాకిస్తాన్ జూన్ 2018 నుండి ఫైనాన్షియల్ వాచ్ డాగ్ యొక్క గ్రే లిస్టులో ఉంది. ఇది దాని ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసింది.
Source : Organiser.





