
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ లో గూండాల రాజ్యం నడుస్తోంది. మరీ ముఖ్యంగా ముస్లిముల ఆగడాలకు అక్కడ అంతే లేకుండా ఉంది. నిన్న నాలుగవ విడత పోలింగ్ సందర్భంగా పోలింగ్ విధులలో ఉన్న కేంద్ర బలగాలపై దాడి చేయవలసిందిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అనుచరులను ఉసిగొల్పడం, దాంతో రెచ్చిపోయిన టి ఎం సి గూండాలు కేంద్ర బలగాలపై దాడులకు దిగడం, దిక్కుతోచని స్థితిలో కేంద్ర దళాలు జరిపిన కాల్పులలో నలుగురు మృతి చెందడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఒక కేసు విచారణలో బెంగాల్ కు వచ్చిన ఒక బీహార్ పోలీస్ అధికారిని ఒక ముస్లిం మెజారిటీ గ్రామంలోని ముస్లిములు కర్రలు, రాళ్లతో కొట్టి చంపిన ఘటన పశ్చిమ బెంగాల్లోని పరిస్థితులను కళ్లకు కడుతోంది.
ఒక చోరీ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్‌కు వచ్చిన బీహార్ పోలీస్ అధికారిని అక్కడి స్థానిక ముస్లిములు కర్రలు, రాళ్లతో దాడి చేసి కొట్టి చంపారు. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని గోల్‌పోఖర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బీహార్‌లోని కిషన్‌గంజ్ పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ అశ్విని కుమార్ ఒక బైక్ చోరీ కేసు దర్యాప్తు కోసం బెంగాల్‌లోని పంజీపర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లిములు అధికంగా ఉండే గ్రామానికి వెళ్లారు. నిందితుల కోసం అక్కడ తనిఖీ చేస్తుండగా స్థానిక ముస్లిములు ఆయనపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
తీవ్ర గాయాలతో పడి ఉన్నపోలీస్ అధికారి అశ్విని కుమార్‌ను ఇస్లాంపూర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మరణానికి కారణమైన ఫిరోజ్ ఆలం, అబూజర్ ఆలం, షాహినూర్ ఖాన్ అనే ముగ్గురు దుండగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీలు చేసి మరికొందరిని అరెస్ట్ చేస్తామని పూర్ణియ రేంజ్ ఐజీ తెలిపారు.
మరోవైపు అశ్విని కుమార్ స్థానిక బెంగాల్ పోలీసుల సహాయం కోరినా వారు సహకరించలేదని, పోలీస్ బృందాలను పంపుతామని చెప్పి ఉద్దేశపూర్వకంగా పంపలేదని బీహార్ పోలీసుల సంఘం ఆరోపించింది. దీనిని బట్టే బెంగాల్ లో పరిస్థితి ఏమిటో అంచనా వేయవచ్చు.





