News

నకిలీ నోట్ల దోషులకు శిక్ష ఖరారు

383views

కిలీ నోట్ల కేసులో అరెస్టయిన శివ భజన్ గుప్తా, కులదీప్ గుప్తా లకు లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 489B, 489C, 120B సెక్షన్ ల ప్రకారం 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధించింది.

24/ 8/ 2018 న శివ భజన్ గుప్తా, వివేక్ రాజ్ పుత్ అలియాస్ గురుదేవ్, కుల్దీప్ గుప్తా, రజనీష్ యాదవ్ అనే నలుగురు నిందితుల నుంచి 4 లక్షల 60 వేల రూపాయల నకిలీ నోట్లను ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు (STF) స్వాధీనం చేసుకున్నారు. లక్నో సమీపంలోని హసన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారిపై 489 B మరియు 489 C సెక్షన్ల కింద కేసు నమోదైంది. 8/ 9/ 2018 నుంచి విచారణ ప్రారంభమైంది.

విచారణలో ఈ నలుగురు నిందితులకీ అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఈ నకిలీ నోట్లు అందించినట్లుగానూ, అతనికి జియాల్ హక్ అనే వ్యక్తి వాటిని అందించినట్లుగానూ తేలింది. అతనికి బంగ్లాదేశ్ కు చెందిన గజ్లూ మియా నుంచి ఆ నకిలీ నోట్లు అందాయి. విచారణ పూర్తయ్యాక ఈ ఆరుగురు నిందితులపై ఎన్ ఐ ఏ చార్జిషీట్ దాఖలు చేసింది.

గత నెల 23 వ తారీఖున నిందితులు వివేక్ రాజ్ పుత్ అలియాస్ గురుదేవ్, రజనీష్ యాదవ్ లకు ఈ కేసులో 4 సంవత్సరాల జైలు, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ లక్నోలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఇప్పుడు తాజాగా వారి సహ నిందితులు శివ భజన్ గుప్తా, కుల్దీప్ గుప్తాలకు కూడా అదే శిక్షను కోర్టు ఖరారు చేసింది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.