హైదరాబాద్ : తొమ్మిదేళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం హత్య : పొరుగింటి షేక్ మస్తాన్ వలీపై బాలిక తల్లిదండ్రుల అనుమానం

తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై గుర్తుతెలియని దుండగుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. తమ కుమార్తె పై జరిగిన అత్యాచారానికి, హత్యకు తమ పొరుగున ఉండే షేక్ మస్తాన్ వలీయే కారకుడనే అనుమానాన్ని బాధితురాలి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
9-year old Tribal girl raped & murdered in Hyderabad on 23rd March. No arrest was made.
Father suspects the neighbor Shaik Mastan Vali as accused. Mother says sniper dog has smelled victim’s hut & proceeded towards neighbor's gate. As it was closed, police dragged the dog back. pic.twitter.com/rnvEhPV5hu— SC Reservation Parirakshana Samiti (@NSCRPS1) March 29, 2021
బాధితురాలి తల్లిదండ్రులిద్దరూ నిరుపేద గిరిజన దినసరి కూలీలు. తమ తొమ్మిదేళ్ళ కుమార్తెను ఇంటి వద్దనే విడచి వారిద్దరూ ఈ నెల 23వ తారీఖున పనికి వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి వారి కుమార్తె తమ గుడిసెలోని దూలానికి విగతజీవిగా నగ్నంగా వేలాడుతూ కనిపించింది. ఆమె మర్మావయవాల వద్ద రక్తపు మరకలు కనిపించాయి. దాంతో గుండెలవిసేలా రోదిస్తూ బాధిత బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. తమ కుమార్తె మృతికి న్యాయం జరిపించ వలసిందిగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Source : Organiser.





