News

నికితా తోమర్ మర్డర్ కేసులో తౌసుఫ్, రెహాన్‌లకు జీవిత ఖైదు

573views

నికితా తోమర్ హత్య కేసులో ఫరీదాబాద్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు తౌసుఫ్, రెహాన్‌లకు జీవిత ఖైదు విధించింది. యువ విద్యార్థిని నికితా తోమర్ హత్య కేసులో వారు నిందితులు.

గత ఏడాది అక్టోబర్ 26 న పట్టపగలు నికిత (21) ను దుండగులు హత్య చేశారు. నికిత బి. కాం. ఫైనల్ ఇయర్ విద్యార్థిని. ఆమె పరీక్షలు వ్రాసి కళాశాల నుంచి బయటకు వస్తుండగా నిందితులు ఆమెను అడ్డుకున్నారు.

తౌసుఫ్, రెహాన్ లు మొదట ఆమెను కారులో అపహరించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె ప్రతిఘటించడంతో తౌసుఫ్ ఆమెపై కాల్పులు జరిపాడు. తౌసుఫ్ కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. అతను ఒక పలుకుబడి కలిగిన రాజకీయ కుటుంబానికి చెందినవాడు. ఈ హత్య సీసీ కెమెరాలో బంధించబడింది. హత్యపై దర్యాప్తు కోసం హర్యానా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

ప్రాసిక్యూషన్ మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. నికిత తల్లి కూడా తన కుమార్తె హంతకులకు మరణశిక్ష విధించాలని కోరుకుంది. కానీ కోర్టు నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధించింది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.