
582views
బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు దాదీ హృదయ మోహిని(93) కన్నుమూశారు. అనారోగ్యంతో ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 2020 మార్చి 27న రాజయోగిని దాదీ జానకి పరమపదించిన తర్వాత బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలిగా దాదీ హృదయ మోహిని బాధ్యతలు స్వీకరించారు. దిల్లీ జోనల్ అధిపతిగానూ పని చేశారు. అన్ని ఖండాల్లో ఆధ్యాత్మిక, రాజయోగ జ్ఞానం, సాత్విక జీవనశైలి వ్యాప్తి చేయడానికి దాదీ హృదయ మోహిని విశేష కృషి చేశారు.





