News

అమ్మమ్మ కష్టాన్ని చూడలేక..’ఈజీ లిఫ్ట్‌’ రూపొందించిన బుడతడు

611views

మ్మమ్మ కష్టాన్ని చూడలేక ఓ మనవడు సరికొత్త పరికరాన్ని తయారు చేశాడు. ఆ పరికరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అదే ‘ఈజీ లిఫ్ట్’ పరికరం. వృద్ధులు, రోగులకు ఎంతో ఉపయోగపడే దీన్ని జూబ్లీహిల్స్‌ భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ పాఠశాల విద్యార్థి రవికర్‌ రెడ్డి రూపొందించాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న రవికర్‌రెడ్డి తన అమ్మమ్మ కష్టాన్ని తొలగించాలని సంకల్పించాడు. వీల్‌ఛైర్‌ కంటే మెరుగైన పరికరాన్ని తయారు చేయాలనుకుని నెలరోజుల్లోనే దాన్ని సిద్ధం చేశాడు. లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈజీ లిఫ్ట్‌ పరికరాన్ని తయారు చేశాడు.

2019-20లో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. దీని ద్వారా వృద్ధులు, రోగులు వేరొకరి సహాయం లేకుండా సులభంగానే ముందుకు కదలవచ్చని రవికర్‌ రెడ్డి చెబుతున్నాడు. మల, మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్లేందుకు ఈ పరికరం ఎంతో ఉపకరిస్తోందని చెప్పాడు. రవికర్‌రెడ్డి ఆలోచన, ఆవిష్కరణ కొత్తగా ఉండటంతో ఈజీ లిఫ్ట్‌.. జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ పరికరం రూపొందించినట్లు విద్యార్థి చెబుతున్నాడు. నెలరోజుల పాటు శ్రమించి కేవలం రూ.3వేల ఖర్చుతో దీన్ని తయారు చేసినట్లు తెలిపాడు. భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని రవికర్‌రెడ్డి చెప్పాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.