ArticlesGalleryNewsProgramms

గుండె గుండెలో రాముని గుడి

867views

యోధ్య రామమందిర నిర్మాణానికి నిధిని సేకరించే నిమిత్తం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఈ నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో పలు చోట్ల పెద్ద ఎత్తున శోభాయాత్రలు నిర్వహించి వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు ఈ అభియాన్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కార్యకర్తలు కలిసి నిధిని సేకరిస్తున్నారు. ఈ క్రమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన, సహకారం లభిస్తూ ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఎన్నో అద్భుతమైన అనుభవాలను కార్యకర్తలు పొందుతున్నారు. పెద్దపెద్ద వ్యాపారులు, రాజకీయవేత్తలు శ్రీ రామచంద్రునిపై భక్తితో పెద్ద ఎత్తున నిధిని సమర్పిస్తున్న సంఘటనలు ఒక ఎత్తయితే అత్యంత నిరు పేదలు, యాచకులు కూడా రామమందిర నిర్మాణంలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలని ప్రబలమైన ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ తమ శక్తికి మించి నిధిని సమర్పిస్తున్న ఘటనలు కోకొల్లలు. ఎంతోమంది మహమ్మదీయ, క్రైస్తవ సోదరులు కూడా ఈ పవిత్ర, పుణ్య కార్యంలో పాలు పంచుకోవడానికి ముందుకొస్తూ ఉండడం విశేషం.

వాటిలో అందుబాటులో ఉన్న కొన్ని సంఘటనలను, ఫోటోలను VSK పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఆ దృశ్యాలను ఒకసారి పరికిద్దాం….

నిధి సేకరణ కరపత్రాన్ని విడుదల చేసిన పూజ్య చిన జియ్యర్ స్వామి

శ్రీమద్రామాయణంలోని ఏడు కాండలకు ప్రతీకగా రూ.12,345,67/- లను అయోధ్య రామ చంద్రుడికి సమర్పించిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారు…

మాజీ బీజేపీ ఎంపీ శ్రీ గోకరాజు గంగరాజు గారి సతీమణి శ్రీమతి లైలా కుమారి, వారి కుమారుడు గోకరాజు గంగరాజు, వారి మనమడు ఆదిత్య వర్మలు శ్రీ రామజన్మభూమి నిర్మాణ నిధికి కోటి రూపాయల చెక్కునందిస్తున్న దృశ్యం.  కార్యక్రమంలో ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ జీ మరియు ఇతర కార్యకర్తలను కూడా చిత్రంలో చూడొచ్చు .

విజయనగరంలో లక్ష రూపాయల చెక్కును అందజేస్తున్న నిరుపేద మహిళ శ్రీమతి అన్నపూర్ణమ్మ

విజయవాడలోని కొన్ని ప్రాంతాలలో జరిగిన శోభాయాత్ర దృశ్యాలు

విశాఖపట్నంలో నిధి సేకరణ దృశ్యాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో నిధి సేకరణ దృశ్యాలు

రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల పెద్ద ఎత్తున శోభా యాత్రలు జరిగాయి. నిధి సేకరణ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. తర్వాత అందుబాటులోకి వచ్చే సమాచారం మేరకు మరింత సమాచారాన్ని, చిత్రాలను పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తాం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.