News

విజయవాడ నడిబొడ్డున సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

601views

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా హిందూ దేవీదేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన విజయవాడ నడిబొడ్డున చోటుచేసుకున్నది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఉన్న ఆటో స్టాండ్ ను ఆలు కొన్ని ఉన్నా శ్రీ రామ మందిరంలోని సీతమ్మ వారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పదే పదే చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు హుటాహుటిన ఘటనాస్థలిని చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడకు చేరిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హిందూ దేవీదేవతల విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా నిరసనకారులు తమ నిరసనను మధ్యాహ్నం వరకూ కొనసాగించారు. జరిగిన, జరుగుతున్న ఘటనలకు కారకులైన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.