News

నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్‌ఎల్వీ సి-50

496views

పీఎస్‌ఎల్వీ సి-50 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థ సీఎంఎస్‌-01 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ మోసుకెళ్లింది. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ-బ్యాండ్‌ సేవలను అందించేందుకు నిర్దేశించిన ఉపగ్రహం. దీని పరిమితి భారత్ తోపాటు, అండమాన్‌-నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లకు విస్తరిస్తుంది. సీఎంఎస్‌ భారతదేశపు 42వ కమ్యునికేషన్‌ ఉపగ్రహం. పీఎస్‌ఎల్వీ-సీ50 ఎక్స్‌ఎల్‌ ఆకృతిలో 22వదని గతంలో ఇస్రో తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.