
74views
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా తాడ్మెట్ల వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించినట్టు గుర్తించారు.
సీఆర్‌పీఎఫ్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్) బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర(ఐఈడీ) పేల్చారు. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు(33) ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా తాడ్‌మెట్ల గ్రామంలో బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోనే ఉన్న అటవీ ప్రాంతంలో అమర్చిన ఐఈడీని నక్సల్స్ పేల్చారు.