News

వైభవంగా శ్రీవారి చక్రస్నానం

539views

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన చక్రస్నాన కార్యక్రమం వేడుకగా సాగింది. ఈ వేకువజామున సన్నిధి నుంచి ఉత్సవమూర్తులను కల్యాణమండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం, అభిషేకాలు నిర్వహించారు. దూప దీప నైవేధ్యాలు సమర్పించారు.

అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి సుదర్శన చక్రతాళ్వార్లకు చక్రస్నానం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే … చక్రస్నానం నిర్వహించేందుకు మహల్‌ వద్ద తొట్టెను నిర్మించి ఆలయంలోనే కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆఖరి అంకానికి చేరుకున్నాయి. రాత్రికి ధ్వజ అవరోహణతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.