News

ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలచిన సేవాభారతి కార్యకర్తలు

741views

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి, సేవాభారతి పిలుపుమేరకు ప్రమాదపుటంచుల్లో ఉన్న కరోనా రోగులకు అమృతంలా పని చేస్తున్న ప్లాస్మా (దాన) సేకరణకు పిలుపునిచ్చిన విషయం మనకందరికీ విదితమే. పిలుపునివ్వడం అందరూ చేసే పనే, కానీ పిలుపునిచ్చినవారే ముందుగా తమ ప్లాస్మాను దానం చేసి ఆదర్శంగా నిలవడం కొందరు మాత్రమే చేయగలపని.

ఆ పనిని సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత కంటి జబ్బుల,చర్మ వ్యాధులు శిబిరాలు  నిర్వహించి అవసరమైనవారికి ఉచితంగా ఆపరేషన్లు, మందులు, కంటి అద్దాలు అందజేసిన స్థానిక “స్వామి నేత్రాలయం” డాక్టర్ లక్ష్మయ్య గారు ఆయన కుమారుడు శ్రీ మహేష్ గారు చేశారు. ఆగస్టు 4వ తేదీన మరియు ఆగస్టు 27వ తేదీన ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలిచి, ” సేవ ఇంటి నుండే మొదలవ్వాలి” అనే మాటను చేసి చూపారు. అందరికీ ఆదర్శంగా నిలచారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.