News

ఐదుగురు చొరబాటుదారుల హతం

197views

పంజాబ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న ఐదుగురిని బీఎస్‌ఎఫ్‌ దళాలు కాల్చి చంపాయి. తార్న్‌ తరన్‌ జిల్లా ఖేమ్‌కరన్‌ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఐదుగురు చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని బీఎస్‌ఎఫ్‌ జవానులు గుర్తించారు. అడ్డుకునే క్రమంలో భారత జవాన్లపై వారు కాల్పులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణలో భాగంగా చొరబాటు దారులపై కాల్పులు జరిపినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు హతమైనట్లు పేర్కొన్నారు. వారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

మరిన్న  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.