News

అయోధ్య భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం

1.1kviews

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సామాన్యులు, ప్రముఖులు వారి ఇంటివద్దే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు వారి అధికారిక నివాసంలో రామునికి పూజలు నిర్వహించారు. అనంతరం సతీమణి ఉషా నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి రామాయణ పఠనం చేశారు. ఉపరాష్ట్రపతి భవన్‌ సిబ్బంది కూడా రామాయణ పఠనంలో పాల్గొన్నట్లు వెంకయ్య నాయుడు ట్విటర్‌లో పేర్కొన్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చేపట్టిన భూమిపూజ కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. భారతప్రధాని నరేంద్రమోదీతోపాటు కొద్ది మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.