News

అయోధ్యలో అడుగిడిన ప్రధాని మోడీ

472views

పురూప ఘట్టానికి అయోధ్యాపురి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపట్లో రామధామానికి శ్రీకారం చుట్టనున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లఖ్‌నవూ చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో అయోధ్యకు విచ్చేశారు. హెలీప్యాడ్‌ వద్ద యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, పలువురు ఉన్నతాధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ నుంచి నేరుగా ప్రధాని హనుమాన్‌గఢీకి చేరుకున్నారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం భూమిపూజ జరిగే ప్రదేశానికి చేరుకుంటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.