పాకిస్థాన్‌లోని ఘావూ, మాష్కే మిలిటరీ ప్రాంతాల్లో జవానులపై దాడులకు పాల్పడ్డట్లు బలూచిస్థాన్ రెబెలియన్ ఫ్రంట్ వెల్లడించింది. బలూచిస్థాన్ రెబెలియన్ ఫ్రంట్ ప్రతినిధి గ్వహ్రమ్ బలోచ్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ గత రాత్రి సర్మాచారులు (బలోచ్ స్వతంత్ర్యం కోసం పోరాడుతున్నవారు) మాష్కేలోని మంగులి చెక్‌పోస్టుపై స్నైపర్లు, భారీ ఆయుధాలతో దాడిచేసి ముగ్గురు జవాన్లను హత్య చేసినట్లు ఫ్రంట్ పేర్కొంది. ఈ దాడిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది. దరజ్ కౌర్ నదీ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లను హతమార్చినట్లు వెల్లడించింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బలోచ్ గొరిల్లా ఫైటర్లపై పాకిస్థాన్ ఆర్మీ బృందం ఆకస్మిక దాడికి పాల్పడిందని, కాగా ఈ ఘటనలో నలుగురు పాక్ జవాన్లను మట్టుబెట్టినట్లు ఫ్రంట్ పేర్కొంది. మరో ఇద్దరిని గాయపరిచినట్లు తెలిపింది. పాక్ ఆక్రమిత బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం లభించే వరకు ఆ దాడులు కొనసాగుతాయని గ్వహ్రమ్ బలోచ్ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.
516
You Might Also Like
వైభవంగా జగ్గన్నతోట ప్రభల ఉత్సవం
25
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి బుధవారం అధిక సంఖ్యలో జనం పోటెత్తారు. ఏకాదశ రుద్రులు ఒకేచోట కొలువైన అపురూప దృశ్యం...
కుంభమేళాలో శ్రీవారికి కైంకర్యాలు
21
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు నిర్వహించారు. శ్రీవారి నిత్య కైంకర్యాల తరహాలో ఉదయం తిరుప్పావై, తోమాల...
తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం
25
తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కైంకర్యాలు పూర్తయ్యాక శ్రీమలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామి తిరుచ్చిలపై పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ పూజాది...
హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు
30
న్యాయాధికారుల కోటా నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది....
నకిలీ టికెట్లతో తిరుమల శ్రీవారి దర్శనం.. పోలీసుల అదుపులో ఐదుగురు
29
నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు) టికెట్లతో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొందరు దళారులు రూ.300 ప్రత్యేక ప్రవేశ...
మకరజ్యోతి దర్శనం.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరులు
33
ఏటా సంక్రాతి పూట అయ్యప్ప భక్తులతో పాటు కోట్ల మంది హిందువులు ఆసక్తిగా ఎదురుచూసే మకర జ్యోతి దర్శనం పూర్తయ్యింది. స్వయంగా అయ్యప్ప స్వామే జ్యోతి రూపంలో...