News

ఫ్రాన్స్ నుంచి భారత్ కు బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు

985views

ఫ్రాన్స్ నుంచి నేడు రఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ద విమానాలు రానున్నాయి. ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఇవి భారత్‌కు బయలుదేరాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గం.లకు టేకాఫ్‌ అయిన యుద్ధ విమానాలు .. బుధవారం అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గ మధ్యంలో అబుదాబి సమీపంలోని అల్-దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద ఆగనున్నాయి. తొలిదశ 5 విమానాలలో రెండు ట్రైనర్ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నట్లు వైమానికాధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.