
లడఖ్‌లో, కార్గిల్‌లోని ద్రాస్ వార్ మెమోరియల్‌లో ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ పూల దండలు వేసి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం వేడుకలు భారీగా తగ్గించబడ్డాయి. దీనిని ఒకే రోజుకు పరిమితం చేశారు.
కార్గిల్ విజయ్ దివస్ నిర్భయమైన సంకల్పానికి, మన సాయుధ దళాల అసాధారణ శౌర్యానికి ప్రతీక అని రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. శత్రువులతో పోరాడి భారతమాతను రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన సైనికులకు శ్రీ కోవింద్ వందనాలు అర్పించారు. “దేశం వారికి మరియు వారి కుటుంబాలకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతుంది” అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇది అధిక ధైర్యాన్ని ఇచ్చిన రోజు, సాయుధ దళాల స్థైర్యాన్ని పెంచిన రోజు, దేశానికి విజయాన్ని స్వంతం చేసిన రోజు అని ప్రధాని పేర్కొన్నారు. ఈ రోజు ఆల్ ఇండియా రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ సైనికులతో పాటు వారి తల్లులకు వందనం చేశారు. 21 సంవత్సరాల క్రితం ఈ రోజునే కార్గిల్ యుద్ధంలో మన సైన్యం విజయ పతాకాన్ని ఎగురవేసిందని ఆయన తెలిపారు.
కార్గిల్ యుద్ధం జరిగిన పరిస్థితులను భారత్ ఎప్పటికీ మరచిపోలేదని శ్రీ నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తమ దేశంలో నెలకొన్న అంతర్గత కలహాల నుండి దృష్టిని మరల్చటానికి భారత గడ్డపై ఆక్రమణకు పాల్పడటం ద్వారా పాకిస్తాన్ ఈ దురదృష్టకరమైన యుద్ధాన్ని ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. “పాకిస్తాన్‌తో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవడానికి భారత్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇది జరిగింది. కానీ దేశం స్పందించింది. ప్రపంచం మొత్తం దేశం యొక్క శక్తిని చూసింది.” అని ఆయన తెలిపారు. భారత సైన్యాన్ని, వారి శౌర్యాన్ని ప్రధాని ప్రశంసించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ప్రధాని తెలిపారు. “వారు ధైర్యవంతులైన వీరులకు వందనాలు చేస్తున్నారు, కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు.” అని ప్రధాని పేర్కొన్నారు. దేశం యొక్క సాహసోపేతమైన యోధుల వీరోచిత గాథలను, వారి త్యాగాలను ఈ రోజంతా స్మరించుకోవాలని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. www.gallantryawards.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కూడా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వెబ్‌సైట్‌లో మన యోధుల యొక్క సాహసోపేతమైన, శౌర్యవంతమైన గాథల సమాచారం ఉంది.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి ప్రాణాలను అర్పించిన కార్గిల్ అమరవీరులకు ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ఈ రోజు నివాళులు అర్పించారు. “కృతజ్ఞతగల దేశం వారి దేశభక్తిని, శౌర్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది.” అని శ్రీ నాయుడు ట్వీట్ చేశారు.
ఈ రోజు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ యుద్ధంలో ధైర్యంగా పోరాడిన సైనికులకు రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. రాజ్ నాథ్ సింగ్ తో పాటు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా జాతీయ యుద్ధ స్మారక చిహ్నానికి దండలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు.
Source : Organiser.





