News

స్వంత కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం : మదర్సా టీచర్ అరెస్టు: తల్లితో సహా మరో ముగ్గురి అరెస్టు : పరారీలో మరో ముగ్గురు నిందితులు

391views

కేరళలోని కాసరగోడ్‌లో గల నీలేశ్వరంలో తన 16 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో మదర్సా టీచర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటనలో, 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రితో సహా ఏడుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేశారు.

ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు నీలేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గురించి బాధితురాలి తల్లికి ఎప్పటినుండో తెలిసినప్పటికీ, ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు బాధితుడి తండ్రితో సహా నలుగురిని అరెస్టు చేశారు. నిందితులపై లైంగిక వేధింపుల నుండి పిల్లల రక్షణ చట్టం (Protection of Children from Sexual Offences) (పోక్సో) కింద అభియోగాలు మోపారు.

గత మూడేళ్లుగా తన తండ్రి తనను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనకు అబార్షన్‌ కూడా జరిగినట్లు ఆమె పోలీసులకు వెల్లడించింది. ఆమెపై మరో ఆరుగురు నిందితులు కూడా అత్యాచారం చేశారు. వారిలో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. తన కూతురుపై  అత్యాచారం జరుగుతున్న తనకు తెలిసినా కూడా ఈ సంఘటనను దాచినందుకు ఆమె తల్లిపై కూడా అభియోగాలు మోపనున్నట్లు పోలీసులు తెలిపారు.

Source : Organiser

https://www.organiser.org/Encyc/2020/7/20/Madrassa-teacher-arrested-for-raping-his-minor-daughter.html

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.