
జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద సోమవారం కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత సైనికులు అడ్డుకుని ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు.
నియంత్రణ రేఖలోని నౌషెరా సెక్టార్ సమీపంలో భారతదేశంలోకి ఉగ్రవాదులు ఉదయం ప్రవేశించడానికి ప్రయత్నించారని సైనిక వర్గాలు తెలిపాయి. అప్పుడు భారత భద్రతా దళాలు వారిని కాల్చి చంపాయి. ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.
విశేషమేమిటంటే, సరిహద్దులోని పాకిస్తాన్ రేంజర్స్ సహాయంతో ఉగ్రవాదులు నిరంతరం భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతిసారీ ఈ ప్రయత్నం విఫలమవుతుంది. ప్రతిసారీ భారత భద్రతా దళాలు వారి ప్రయత్నాలను విజయవంతంగా నిలువరిస్తున్నాయి.
న్యూస్ 18 జమ్మూ నివేదిక ప్రకారం, మన భద్రతా దళాలు మరో 10 మంది ఉగ్రవాదులను కూడా పూంచ్లోని మెన్ధార్ సెక్టార్లో మట్టుబెట్టాయి.
మరోవైపు భారీ నార్కో-టెర్రర్ మాడ్యూల్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు. సోమవారం ఉదయం ఆరుగురు నార్కో ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీరికి జైషే మహ్మద్ సంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
Source : News18 & INDIAN DEFENCE NEWS





