News

జమ్మూకాశ్మీర్లో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు హతం

697views

భారత జవాన్లు జమ్ము కాశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్ము కాశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న భారత జవాన్లు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఉన్నట్టుండి ఒక చోటు నుంచి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భారత జవాన్లు వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా, మరో ఉగ్రవాది పారిపోయాడు. ఆ మూడో ఉగ్రవాది కోసం జవాన్లు తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.