News

ఆ పావురం పాక్ గూఢచారి

324views

క అనుమానాస్పద గూఢచార పావురాన్ని అంతర్జాతీయ సరిహద్దులో పట్టుకున్నట్టు భద్రతాదళ అధికారులు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామస్థులు హిరానగర్‌ సెక్టార్‌ వద్ద దొరికిన ఒక పావురాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అది పాకిస్థాన్‌ బోర్డర్‌ వైపు ఎగురుతుండగా కింద పడిపోయిందని వారు తెలిపారు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా దాని కాళ్లకు ఒక చిన్న రింగు ఉండటం పోలీసులు గుర్తించారు. దానిపై ప్రత్యేక కోడింగ్‌తో కూడిన సంఖ్యలు ఉండటంతో అది పాక్‌ గూఢచార కపోతంగా కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా నిర్థారించారు. దాన్ని ఆర్మీ అధికారులకు అప్పగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.