News

వెన్ను చూపని వీరుడు పృధ్వీరాజ్ చౌహాన్

593views

పృధ్వీరాజ్ చౌహాన్ రాజ పుత్ర వంశానికి చెందినవాడు. ఈయన 11 ఏళ్లకే సింహాసనాన్ని అధిరోహించాడు. పృధ్వీరాజ్ చౌహాన్  బహు భాషా కోవిదుడు. ఈయన 14 భాషలు అనర్గళంగా మాట్లాడేవాడు అని చరిత్ర చెబుతోంది.

అజ్మీర్ మరియు ఢిల్లీలను  జంట రాజధానులుగా చేసుకుని పరిపాలించాడు. ఢిల్లీకి రెండవ చివరి హిందూ చక్రవర్తి పృధ్వీరాజ్ చౌహాన్ కావడం విశేషం.

ముస్లిం రాజుల దండయాత్రలకు వ్యతిరేకంగా అనేక హిందూ సంస్థానాలను, రాజపుత్ర రాజులను ఏకం చేసిన మొట్ట మొదటి రాజు పృధ్వీరాజ్ చౌహాన్.

పృధ్వీరాజ్ చౌహాన్ పేరు వింటేనే ముస్లిం రాజులు దడుసుకు చచ్చే వాళ్ళు. ఎలాగైనా పృధ్వీరాజ్ ని ఓడించాలనే కసితో వేల మంది ముస్లిం సైనికులతో తారాయున్ ప్రాంతంలో దాడికి దిగారు. దానినే మొదటి తారాయున్ యుద్ధం అంటారు చరిత్రలో.  ముస్లిం రాజులతో జరిగిన అతి పెద్ద యుద్ధం ఇదే కావడం ఈ యుద్ధంలో పృధ్వీరాజ్ చౌహాన్ ముస్లిం సేనలపై విరుచుకు పడ్డాడు. ఘనవిజయం సాధించాడు. ఇక అప్పటి నుంచి కొన్నేళ్ళు భారత్ మీద దండయాత్ర అంటే ముస్లిం రాజులు భయంతో వణికి చచ్చేవారు.

పృధ్వీరాజ్ ప్రేమ కథ

భారతదేశ చరిత్రలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వన్నె తరగని అద్వితీయ ప్రేమ కథ పృధ్వీరాజ్ చౌహాన్, రాణి సంయుక్తలది. కనౌజ్ ని పరిపాలించిన ఘడ్వాల్ రాజు జయచంద్రుని కూతురు సౌందర్యవతి  అయిన సంయుక్తని ఎత్తుకెళ్ళి పృద్విరాజ్ పెళ్లి చేసుకోవడం భారతదేశ జన సాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన ప్రేమ కథ. ఇప్పటికీ అనేక సినిమా కథలకి, అనేక మంది రచయితలకు వాళ్ళ ప్రేమ కథే స్ఫూర్తి.

పృధ్వీరాజ్ దయగల హిందూ రాజపుత్ర రాజు. మహమ్మద్ ఘోరీని 17 సార్లు ఓడించి కూడా అతన్ని సంహరించలేదు. కానీ తనకు ఇష్టం లేకుండా పృధ్వీరాజ్ చౌహాన్ తన కుమార్తెను వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో రాణి సంయుక్త తండ్రి జయ చంద్రుడు మహమ్మద్ ఘోరీ తో చేతులు కలిపి పృథ్వీరాజ్ యుద్ధంలో ఓడిపోవడానికి దోహదపడ్డాడు. చరిత్రలో ద్రోహిగా నిలచిపోయాడు. కానీ పృధ్వీరాజ్ ఓడినప్పుడు అతని కళ్ళు పొడిపించాడు ఘోరీ. తనకు సహకరించిన రాజా జయచంద్రుని కూడా నిర్మొహమాటంగా సంహరించిన క్రూరుడు ఘోరీ.

ముస్లిం మతంలోకి మారడానికి నిరాకరించిన హిందూ రాజు పృధ్వీరాజ్ చౌహాన్ ను తీవ్ర హింసలకు గురిచేయ్యడంలో, అతని భార్య సంయోగిత ను వివస్త్రను చేసి అందరిముందూ బలాత్కారం చెయ్యడంలో మహ్మద్ ఘోరీకి అప్పటి ఇస్లాం మత గురువు ఖ్వాజా మొహియుద్దీన్ చిష్తీ ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉంది.

అనంతరం శబ్దభేధి విద్య తెలిసిన పృధ్వీరాజ్ ఘోరీ కంఠంలోకి బాణాన్ని వేసి సంహరించాడంటారు.  ఖ్వాజా మొహియుద్దీన్ చిష్తీ కూడా పృధ్వీరాజ్ కొడుకుల చేతిలో చనిపోయాడంటారు. ముస్లిం సైనికులు పృధ్వీరాజ్ భౌతిక కాయాన్ని ఆఫ్ఘనిస్తాన్ తరలించి అక్కడే సమాధి చేశారు. ముస్లిం ఆచారం ప్రకారం రోజూ ఆ సమాధిని చెప్పులతో కొట్టేవారు. ఈ విషయం తెలిసి షేర్ సింగ్ రాణా అనే రాజపుత్ర వీరుడు ఆ దేశం వెళ్లి,  పృధ్వీరాజ్ కు దహన సంస్కారాలు చేసి, తిరిగి వచ్చి ఆ అస్తికలను గంగా నదిలో కలిపాడు.

ఖ్వాజా మొహియుద్దీన్ చిష్తీ తన జీవిత కాలంలో 90 లక్షల మంది హిందువులను ముస్లింలుగా మార్చాడని ముస్లిములు అతనిని కీర్తిస్తారు. దురదృష్ట వశాత్తూ నేడు అలాంటి వాడి సమాధికి రోజూ వందలాది మంది హిందువులు వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.

భారతదేశ చరిత్ర పుటలను తిరగేస్తే స్వదేశ, స్వధర్మ రక్షణ కోసం ఎన్ని కష్టాలనైనా భరించి ఆజన్మాంతం వెన్ను చూపక పోరాడిన మహా వీరులు ఎందరో కనిపిస్తారు. అలాంటి వీరులలో పృధ్వీరాజ్ చౌహాన్ అగ్రగణ్యుడు. నేడు సామ్రాట్ పృద్విరాజ్ చౌహన్ గారి 854 జయంతి కావడం వారిని స్మరించుకోవడం మన అదృష్టం. 12 శతాబ్దంలో వారి పరిపాలన జన రంజకంగా సాగినట్లు చరిత్ర చెబుతోంది.

…………జయహో సామ్రాట్ పృధ్వీరాజ్ చౌహాన్

సేకరణ : బూదూరు కరుణాకర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.