శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ – ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం అటవీ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ముఖ్యంగా వన్యప్రాణులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. అదే విధంగా కీలకమైన అటవీ ప్రాంతంలో 86.74...







