అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం పంతులు
(మే 27 - కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ) తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం పంతులు 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. పుస్తకాలు చదివి ప్రభావితులై సామాజిక దురాచారాల నిర్మూలన దిశగా కృషి చేశారు. దేశంలో మొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి వీరేశలింగం కావడం విశేషం. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. స్త్రీ విద్య కోసం ఉద్యమించిన వీరేశలింగం పంతులుగారు బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. బ్రిటిష్ హయాంలో జరుగుతున్న బాల్య వివాహాలకు నిరసనగా ఆయన...




