సౌదీ అరేబియాలో బయటపడిన 8000 ఏళ్ల నాటి దేవాలయం
సౌదీ అరేబియా లో 8000 సంవత్సరాల పురాతన ఆలయం తవ్వకాల్లో బయటపడింది. ఆలయ అవశేషాలను అక్కడి పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి ససబంధించిన ఫొటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సౌదీ రాజధాని రియాద్‌కి నైరుతి దిశలో వున్న ఆల్ఫా ప్రాంతంలో 8000 ఏళ్ల నాటి ఆలయ అవశేషాలు బయటపడ్డాయని పురావస్తు శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పురావస్తు శాఖలో ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఈ అవశేషాలు బయటపడటంతో పురాతన నాగరికతలు ఎలా వుండేదో తెలిసి వచ్చింది. అత్యంత మన్నికైన రాతితో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని, దీనిని నిర్మించిన సృష్టికర్తల నిర్మాణ నైపుణ్యం అమోఘమని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆలయంతో పాటు బలిపీఠాల అవశేషాలు కూడా బయటపడ్డాయి. అంతేకాకుండా ఈ అవశేషాలు...




