భక్తి మార్గానికి బాటలు వేసే నామసంకీర్తనం
సనాతన ధర్మంలో భక్తి మార్గానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. భగవంతుడిని చేరుకునేందుకు జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలను మన ఋషులు సూచించారు. వాటిలో సామాన్యుల నుంచి మహాత్ముల వరకు అందరికీ సులభంగా ఆచరించగలిగే మార్గం భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో భజనలు, నామసంకీర్తనలు అత్యంత పవిత్రమైన సాధనలుగా భావిస్తారు. భజన అంటే కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు.. భగవంతుని నామాన్ని స్మరిస్తూ, ఆయన మహిమలను కీర్తిస్తూ మనసును దైవ చింతనలో నిలిపే ఆధ్యాత్మిక సాధన. భజనల ద్వారా భక్తుడి హృదయంలో భక్తి భావం పెరిగి, ఆత్మశాంతి కలుగుతుందని సనాతన ధర్మం చెబుతుంది. వేద కాలం నుంచి నామస్మరణకు ప్రాధాన్యం సనాతన సంప్రదాయంలో మంత్రోచ్చారణ, స్తోత్ర పఠనం, కీర్తనలు అనాదిగా కొనసాగుతున్నాయి. వేదాల్లో దేవతా స్తుతులకు విశేష ప్రాధాన్యం ఉంది. అనంతర కాలంలో ఆళ్వార్లు,...








