News

News

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

ఆంధ్ర ప్రదేశ్ లో 175 శాసన సభా స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు , హోం ఓటింగ్ కు సంబంధించిన ఓట్లు, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాకెట్ ఓట్లు, హోం ఓట్లు, సర్వీసు ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపడతారు. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్, తదితర ఓట్ల లెక్కింపు ఆ సమయంలోగా పూర్తి కాని పక్షంలో వాటి లెక్కింపును కొనసాగిస్తూనే EVM ఓట్ల లెక్కింపును చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ...
News

దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల లెక్కింపు

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత దేశంలో 543 మంది సభ్యులు గల లోక్ సభకు ...., ఆంధ్ర ప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికలకు సంబంధిన ఓట్ల లెక్కింపు మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. రాజకీయ పార్టీల మధ్య ఎంతో హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు పొందుపరచే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో అందుబాటులో ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్...
News

వైకోమ్‌ సత్యాగ్రహం హిందూ ఐక్యతకు చిహ్నం : నంద కుమార్

వైకోమ్‌ సత్యాగ్రహం జాతీయ స్థాయిలో స్వాతంత్య్ర పోరాటానికి శక్తినిచ్చిందని ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్‌ అన్నారు. కొట్టాయంలో వైకోమ్‌ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘‘జాతీయ పునరుజ్జీవనం` వైకోమ్‌ సత్యాగ్రహం’’ అన్న పేరుతో సెమినార్‌ జరిగింది. ఈ సందర్భంగా ప్రఫుల్ల...
News

మధ్యప్రదేశ్‌లోని చారిత్రక భోజ్‌శాలలో కొనసాగుతున్న సర్వే

మధ్యప్రదేశ్‌లోని చారిత్రక భోజ్‌శాలలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్‌కి చెందిన ఆర్కియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్ఐ) మరియు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా బృందం భోజ్‌శాల ప్రవేశ ద్వారం దగ్గర గ్రౌండ్‌ పెనేట్రేటింగ్‌ రాడార్‌ అన్న...
News

అమెరికా గడ్డపై భారత్- పాక్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు!

అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల కోసం అటు ఐసిసి, ఇటు పోలీసులు కట్టుదిట్టమైన నిఘాల మధ్య భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్‌ 9వ తేదీన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్‌ స్టేడియం’లో...
News

వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్న దలైలామా

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా ఈ నెలలో అమెరికా వెళ్లనున్నారు. మోకాలి చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లనున్నట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం తరువాత దలై లామా విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ...
News

జై హనుమాన్‌

హనుమజ్జయంతి జిల్లాలో వైభవంగా జరిగింది. రామాలయాలు, ఆంజనేయ స్వామి విగ్రహాల వద్ద పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ప్రీతిపాత్రమైన తమలపాకులు, వివిధ రకాల పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు సింధూరం అందించారు. భక్తులు ఆంజనేయ స్వామి చిత్రంతో...
News

తొలకరి పలకరింపు

రాష్ట్ర రైతాంగాన్ని తొలకరి పలకరించింది. మూడు నెలలుగా ఎండ తీవ్రత, వర్షాభావంతో అల్లాడిన ప్రజలు, రైతులకు ఊరటనిచ్చేలా నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మే 30న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని అనేక భాగాలు,...
News

దేశాభివృద్ధి కలలు సాకారం చేసుకోవాలి.. మోదీ సుదీర్ఘ లేఖ

దేశాభివృద్ధి కోసం కలలు కని వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో మోదీ సుదీర్ఘ లేఖ రాశారు. దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. దేశ పురోగతి...
News

సైనికుడి కుటుంబానికి సత్కారం

వీర మరణం పొందిన 79వ బెటాలియన్‌ సీఆర్పీఎఫ్‌ సైనికుడు ఎం.సుధాకర్‌రావుకు నూజివీడు పట్టణం నెహ్రూపేట సామాజిక భవనంలో సీఆర్పీఎఫ్‌ అధికారుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. 1995 జూన్‌ 02న మణిపూర్‌లో తిరుగుబాటుదారులతో జరిగిన ఎన్‌కౌంటర్లో సైనికుడు సుధాకర్‌రావు వీరమరణం పొందారు. హైదరాబాద్‌ చాంద్రాయణ గుట్ట సీఆర్పీఎఫ్‌ కార్యాలయ ఉన్నతాధికారుల ఆదేశంతో నోడల్‌ అధికారి, ఏఎస్సై మల్లేష్‌ బృందం నూజివీడు వచ్చి అధికారుల సమక్షంలో సుధాకర్‌రావు సతీమణి జయమ్మకు, కుటుంబసభ్యులకు సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ.. తాను మరణిస్తానని తెలిసి కూడా దేశ, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన వీర సైనికుడు సుధాకర్‌రావు అని కొనియడారు. వీర మరణం పొందిన సైనికుల జీవితాలు నేటితరం యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, పోలీసు,...
1 1,188 1,189 1,190 1,191 1,192 2,479
Page 1190 of 2479