వీర మరణం పొందిన 79వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ సైనికుడు ఎం.సుధాకర్‌రావుకు నూజివీడు పట్టణం నెహ్రూపేట సామాజిక భవనంలో సీఆర్పీఎఫ్ అధికారుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. 1995 జూన్ 02న మణిపూర్‌లో తిరుగుబాటుదారులతో జరిగిన ఎన్‌కౌంటర్లో సైనికుడు సుధాకర్‌రావు వీరమరణం పొందారు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట సీఆర్పీఎఫ్ కార్యాలయ ఉన్నతాధికారుల ఆదేశంతో నోడల్ అధికారి, ఏఎస్సై మల్లేష్ బృందం నూజివీడు వచ్చి అధికారుల సమక్షంలో సుధాకర్‌రావు సతీమణి జయమ్మకు, కుటుంబసభ్యులకు సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ సీఐ ఎంవీవీఎస్ మూర్తి మాట్లాడుతూ.. తాను మరణిస్తానని తెలిసి కూడా దేశ, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన వీర సైనికుడు సుధాకర్‌రావు అని కొనియడారు. వీర మరణం పొందిన సైనికుల జీవితాలు నేటితరం యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
390views