ఆంధ్ర ప్రదేశ్ లో 175 శాసన సభా స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు , హోం ఓటింగ్ కు సంబంధించిన ఓట్లు, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాకెట్ ఓట్లు, హోం ఓట్లు, సర్వీసు ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపడతారు. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్, తదితర ఓట్ల లెక్కింపు ఆ సమయంలోగా పూర్తి కాని పక్షంలో వాటి లెక్కింపును కొనసాగిస్తూనే EVM ఓట్ల లెక్కింపును చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేశారు. సి సి కెమెరాల పర్వక్షణలో లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి పోస్టల్ బ్యాలెట్ లు అధిక సంఖ్యలో 4 లక్షల 61 వేలు పోలయ్యాయి.
366views
You Might Also Like
ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య...
‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష
తెనాలి పరీక్ష". నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని...
దయ చూపండంటున్నా.. మహిళకు షరియా శిక్ష 100 కొరడా దెబ్బలు
13
ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో...
ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
11
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా...
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి.. విద్యార్థులకు అజిత్ డోభాల్ పిలుపు
32
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా...
పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
10
పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు...





