తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్(తేజ్) బహదూర్ ఎంతో ప్రత్యేకమైనవాడు. ఈయన సిక్కు మతాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశాడు. కాశ్మీర్ పండిట్లను ఇస్లాం మతంలోకి మారేందుకు బలవంత పెడుతున్న మొఘల్ పరిపాలకులకు వ్యతిరేక పోరాటం చేశారు. అంతే కాదు ఇస్లాం మతంలోకి మారమంటే మారను అని తిరస్కారం వ్యక్తం చేసినందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో ఢిల్లీ లో బహిరంగంగా అందరూ చూస్తుండగానే తలా నరికివేయబడ్డాడు. ఢిల్లీలో...