
320views
తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్(తేజ్) బహదూర్ ఎంతో ప్రత్యేకమైనవాడు. ఈయన సిక్కు మతాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశాడు. కాశ్మీర్ పండిట్లను ఇస్లాం మతంలోకి మారేందుకు బలవంత పెడుతున్న మొఘల్ పరిపాలకులకు వ్యతిరేక పోరాటం చేశారు. అంతే కాదు ఇస్లాం మతంలోకి మారమంటే మారను అని తిరస్కారం వ్యక్తం చేసినందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో ఢిల్లీ లో బహిరంగంగా అందరూ చూస్తుండగానే తలా నరికివేయబడ్డాడు. ఢిల్లీలో రెండు ప్రదేశాలలో ఒకటి గురు తేగ్ బహదూర్ చంపబడ్డ ప్రాంతం, మరొకటి ఆయన అంత్యక్రియలు జరిపిన ప్రాంతం. ఈ రెండు గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్, గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ పేరుతో స్మృతి మందిరాలుగా ఏర్పడ్డాయి.












