‘సర్వశాస్త్ర మయీ గీత’
గీత- కురుక్షేత్రం నడుమ, ఒక మహా సంగ్రామం ఆరంభ వేళ జరిగిన తాత్విక చర్చ, కురుక్షేత్రం, యుద్ధం ఇవి మన అంతర్గత సమరానికి ప్రతీకలంటారు. పండితోత్తములు. మనలోని యుద్ధ వాతావరణాన్ని గమనించాలి. మానసిక బలహీనతను ఓడించాలి. ఇందులో పాండవ మధ్యముడు ఆత్మ అయితే, కృష్ణ పరమాత్మ బ్రహ్మ. వారు అధిరోహించిన రథం మానవ దేహానికి ప్రతీక అంటారు. ఇది నరనారాయణుల మధ్య భావ వినిమయం. ఎంత గొప్ప భావన! శ్రోత...








